Listen to this article

▪️దళిత ఐక్యవేదిక

జనం న్యూస్ 07జూన్( కొత్తగూడెం నియోజకవర్గం ప్రతినిధి శంకర్)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాప్ రీపోటర్ జూన్ 7సుజాత నగర్:-సుజాతనగర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన 39వ డివిజన్ ను ఎస్సీ రిజర్వేషన్ చేయాలని కోరుతూ శనివారం నాడు సుజాతనగర్ మండల కేంద్రంలో దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో మాదిగ ,బేడ బుడగజంగాలు ,మాల కుల నాయకులు పాల్గొన్నారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కార్పొరేషన్ ఏర్పాటు అధికార యంత్రాంగం సుందరయ్య నగర్ అంబేద్కర్ నగర్ హరిజనవాడ గొల్లగూడెం కోమటిపల్లి నిమ్మల గూడెం ప్రాంతాన్ని కలిపి 39 వ డివిజన్ గా ఏర్పాటు చేశారని, డివిజన్లో మొత్తంగా చూసుకుంటే దళితులే ఎక్కువగా ఉన్నారని, ప్రధానంగా మాదిగ ,బేడ బుడగజంగాల ,మాల సామాజిక వర్గం ప్రజలు అత్యధిక ఓటర్లు ఉన్నారని, ప్రభుత్వం అధికార యంత్రాంగం ఈ డివిజన్ కు ఎస్సీ రిజర్వేషన్ కల్పించాలని అన్నారు , దీని విషయమై డివిజన్ పరిధిలో ఉన్న దళితులం అందరం ఐక్యతగా మిగతా వర్గాలను కలుపుకొని సంతకాల సేకరణ చేపడతామని, మా ఆవేదన వినతిని సంబంధిత పాలకులకు కార్పొరేషన్ కమిషనర్ కు మరియు కలెక్టర్ కు లిఖితపూర్వకంగా అందజేస్తామని తెలిపారు ,ఎస్సీ రిజర్వుడుగా అధికారిక ప్రకటన వచ్చేంతవరకు దశల వారి నిరసన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు, కార్యక్రమంలో మాదిగ ఐక్యవేదిక మండల అధ్యక్షులు వేల్పుల భాస్కర్, బుడగ జంగాల జిల్లా నాయకులు సిరిగిరి మురళి, ఐక్యవేదిక మండల ఉపాధ్యక్షులు కత్తి బాలకృష్ణ ,మాల కుల సంఘం నాయకులు మంచాల శ్రీనివాస్, మాదిగ కుల మండల నాయకులు కత్తి వెంకన్న ,కేసు పాక వెంకటేశ్వర్లు, కత్తి యోగేష్ ,తోకల వెంకటేశ్వర్లు, కత్తి తిరుపతిరావు ,బుడగ జంగాల నాయకులు సిరిగిరి రవి, పసుపులేటి నాగేశ్వరరావు ,మారయ్య ,రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు