Listen to this article

జనం న్యూస్ 07 జూన్ కొత్తగూడెం పట్టణo 27 వ వార్డు లోని బర్లిఫిట్ ఏరియాలో శ్రీపాద పద్మ w/0 యాదగిరి అను మహిళ ఈరోజు ఉదయం ఐదు గంటల ప్రాంతంలో తన ఇంటి ముందు పరిసరాలను శుభ్రం చేసుకుంటున్న సమయంలో ఒక గుర్తు తెలియని అగంతకుడు ద్విచక్ర వాహనంపై వచ్చి తన చేతిలో ఉన్న గుడ్డతో నోరు మూసి మెడలో ఉన్న తాళిబొట్టు పుస్తెలతాడు బలవంతంగా దొంగిలించుకుని పారిపోయినాడు ఆ మహిళ లబోదిబోమని ఏడుస్తూ ఉన్నది స్థానిక కొత్తగూడెం పట్టణ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ మహిళా ఎస్సై పోలీస్ కానిస్టేబుల్స్ ఇద్దరు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు