Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 7 రిపోర్టర్ సలికినీడి నాగరాజు : ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మున్సిపల్ పాఠశాలల సంబంధించి స్కూల్ అసిస్టెంట్ మరియు ప్రైమరీ హెచ్ ఎం పదోన్నతుల విషయంలో ఏర్పడిన సందిగ్ధతను తొలగించడానికి ఉమ్మడి జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక ని ఈ రోజున ఎస్టియు యుటిఎఫ్ ఆధ్వర్యంలో ప్రాతినిధ్యం చేసి వివరాణాత్మకంగా మంజూరు కాబడిన పోస్టులు, ప్రస్తుతం చూపించిన ఖాళీలు, డీఎస్సీకి చూపించబడిన ఖాళీలు అన్ని వివరాల వివరాలను తెలియజేయడం జరిగింది ఇంకా పెండింగ్లో ఉండి ఇవ్వాల్సిన పదోన్నతులు ఇవ్వాలని కోరడం జరిగింది. జిల్లా విద్యాశాఖ అధికారి స్పందిస్తూ పాఠశాలల వారీగా వివరాలు సేకరించి కచ్చితంగా ఇవ్వాలని సంబంధిత అధికారులకు తెలియజేశారు, సీనియర్ లిస్టులో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు సమాచారం అందించి ఉపాధ్యాయుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి వెంటనే వారికి కూడా పదోన్నతులు ఈ రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది. పాఠశాలలకు ఉపాధ్యాయులకు విద్యార్థులకు ఎటువంటి నష్టం చేకూర్చకుండా చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల ప్రాతినిధ్యం మేరకు మరొక పదిమంది ఉపాధ్యాయులకు మేలు కలుగుతుందని, సమస్యను డిఈ వో దృష్టికి తీసుకుని రాగానే స్పందించినందుకు జిల్లా విద్యాశాఖ అధికారికి ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక తరపున కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఎస్టియు జిల్లా అధ్యక్షులు డి పెదబాబు ఎస్ టి యు రాష్ట్ర డైరీ కన్వీనర్ పోటు, శ్రీనివాసరావు. యుటిఎఫ్ పల్నాడు జిల్లా అధ్యక్షులు కే శ్రీనివాసరెడ్డి కార్యదర్శి కె తిరుపతి స్వామి. ఎస్ టి యు పల్నాడు జిల్లా కార్యదర్శి వి అక్కయ్య మేకల కోటేశ్వరరావు విజయ ప్రకాష్ ఎం సి హెచ్ వెంకట స్వామి ఐ అంకమ్మరావు టి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.