

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 7 రిపోర్టర్ సలికినీడి నాగరాజు : జగన్ తక్షణమే సాక్షి టీవీ ఘటనపై రాష్ట్ర మహిళలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలి : ప్రత్తిపాటి.తన అవినీతి ఛానల్ లో పనిచేసే బుద్ధిహీనులు చేసిన వ్యాఖ్యలకు జగనే బాధ్యుడు : ప్రత్తిపాటి“ జగన్ కు తొలినుంచీ మహిళలంటే చిన్నచూపే. కన్నతల్లిని, తోడబుట్టిన చెల్లినే గౌరవించని వ్యక్తి, వారి సంతోషాన్ని జీర్ణించుకోలేని వ్యక్తి ఇతర మహిళల్ని గౌరవిస్తాడు అనుకోవడం దురాశే. అవినీతి సొమ్ముతో పెట్టిన సొంత మీడియా చేతిలో ఉందికదా అని జగన్ ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తాను.. గిట్టని వారిని తూలనాడతాను అంటే సహించేది లేదు. రాజధాని మహిళల్ని కించపరిచిన సాక్షి ఛానల్ కు, ఆ టీవీ సిబ్బందికి.. దాని సృష్టికర్త జగన్ కు రాష్ట్ర మహిళలు తగిన బుద్ధి చెప్పాలి. మరోమారు ఏ మహిళ గురించి అయినా చులకనగా మాట్లాడాలంటే భయపడేలా శాస్తి చేయాలి. సృష్టికి మూలమైన స్త్రీమూర్తుల్ని గౌరవించలేని వారు అసలు మనుషులే కారు. నిత్యం స్త్రీలను పూజించి, గౌరవించే భరతమాత ముద్దబిడ్డల మధ్యన, ముఖ్యంగా రాష్ట్రంలో జగన్ లాంటి మహిళా ద్వేషికి స్థానం లేదు. తన అవినీతి ఛానల్ లో పనిచేసే బుద్ధి హీనులు రాజధాని మహిళలపై చేసిన సంస్కార హీన వ్యాఖ్యలకు ముమ్మాటికీ జగన్మోహన్ రెడ్డే బాధ్యుడు. సాక్షి ఛానల్, పత్రిక సృష్టికర్తగా జరిగిన తప్పుకు నైతిక బాధ్యత వహిస్తూ జగన్ తక్షణమే రాష్ట్ర మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి, రాజధాని మహిళల్ని బేషరతుగా క్షమాపణలు వేడుకోవాలి. విలువులకు తిలోదకాలిచ్చి వ్యక్తిగత ప్రయోజనాలే ధ్యేయంగా వ్యవహరిస్తోన్న జగన్ అవినీతి మీడియాపై కఠిన చర్యలు చేపట్టాలి. సాక్షి ఛానల్.. పత్రిక పుట్టుక నుంచి తగిన విచారణ జరిపి, పత్రికా స్వేచ్ఛ ముసుగులో అడ్డగోలుగా చేస్తున్న దుష్ప్రచారంపై లోతుగా విశ్లేషించాల్సిన బాధ్యత ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కేంద్రప్రభుత్వంపైనే ఉంది అని మాజీమంత్రి ప్రత్తిపాటి ఒక ప్రకటనలో సూచించారు.