

జనం న్యూస్, జూన్ 8 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)
అధికార పార్టీ అండతో తమ భూమిని కబ్జా చేసి మమ్మల్ని మానసిక వేదనకు గురి చేస్తున్నాడు అంటూ ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం సింగాటం గ్రామానికి చెందిన రైతు సురేష్ మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి పుదురి నర్సింలు అదే గ్రామానికి చెందిన తోకల దయానంద రెడ్డి వద్ద పిడిచెడు గ్రామ శివారులో సర్వే నంబర్193, 195 , 18గుంటలు, సర్వే నంబర్194 లో 4 ఎకరాలు కొనుగోలు చేయడం జరిగిందని అన్నారు. మా గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడు, అధికార పార్టీ అండ చూసుకొని మాపై దాడులు చేస్తూ మమ్మల్ని చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసామని, కోర్ట్ ఇంజక్షన్ ఆర్డర్ వచ్చిందని,కోర్ట్ ఇంజెక్షన్ ఆర్డర్ ను ధిక్కరించితమ భూమిలో కడిలు పాతరని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కల్పించుకొని మాకు తగిన న్యాయం చేయాలని, తమని భయభ్రాంతులకు గురి చేసిన వారిని శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు.