Listen to this article

జనం న్యూస్ జూన్ 08:

నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తాళ్ళరాంపూర్ లోప్రతి సంవత్సరము మృగశిర కార్తె (మిరుగు)రోజునా చేపమందు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఆదివారం రోజునా చేప మందు కార్యక్రమం కొనసాగింది.నిర్వహకుడు బెజ్జరాం లింబాద్రి మాట్లాడుతూ మా నాన్న గారి నాన్న చేప మందు ఇచ్చే వారుఅంటే దాదాపు నేటికీ 80సంవత్సరాలు అవుతుంది అన్నారు. ఈ రోజు దాదాపు 1000మంది రావడం జరిగింది. చుట్టుపక్కల గ్రామాల వారే కాక ఇతర జిల్లాల నుండి వచ్చి చేప మందు త్రాగుతారు దీని వలన అస్తమా వ్యాధి (దగ్గు, దమ్ము )నయం అవుతుంది. ఈ చేప మందు నేను,మా అన్నయ్య కొడుకు రఘు, నా కొడుకు సాయికృష్ణ మా ఇంటి సభ్యులము మాత్రమే పంపిణి చేస్తాం అని మాట్లాడారు.