

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
భక్తులకు పెద్ద ఎత్తున అన్నదానం స్వామివారిని దర్శించుకున్న రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా.సర్పంచ్ సూర్య నారాయణ
నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీలోని ఆరవపల్లిలో కొలువైన శ్రీ సీతారాము ల ఆలయ పునర్నిర్మాణం మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఇందులో భాగంగా సీతారాముల కళ్యాణ వేడుకలు కన్నులు పండుగ గా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి నాగి రెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ లు ఆలయానికి చేరుకుని స్వామివార్లను దర్శించు కున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త గంపా సుధాకర్ ప్రసాద్ చలపతి మల్లికార్జున శివయ్య ల ఆధ్వర్యంలో పూర్ణ కుంభంతో వెళతాళాలా మధ్య మేడా విజయ శేఖర్ రెడ్డి సర్పంచ్ సూర్యనారా యణలకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం గజమాలతో శాలువాలతో సత్కరించారు. ఈ కార్య క్రమంలో తెలుగుదేశం పార్టీ బీసీ కార్యదర్శి కానకుర్తి వెంకటయ్య బెస్త సుబ్రహ్మణ్యం ఈశ్వరయ్య సుదర్శన్ అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సర్పంచ్ జంబు సూర్యనారాయణ సహకారంతో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.