


జనం న్యూస్. జనవరి 23. సంగారెడ్డి జిల్లా. హత్నూర మండలం. ప్రతినిధి. (అబ్దుల్ రహమాన్)
మండల కేంద్రమైన హత్నూర గ్రామపంచాయతీ ఆవరణలో ఏర్పాటుచేసిన గ్రామసభ రసాబసాగా కొనసాగింది. గ్రామస్తుల మరియు అధికారుల మధ్య కొద్దిసేపు మాటల యుద్ధం నెలకొంది. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్నా అసలైన లబ్ధిదారుల పేర్లు లేకపోవడంతో గ్రామస్తులు మాజీ ప్రజా ప్రతినిధులు అధికారులను నిలదీశారు. త్వరలోనే స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టే కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలంటూ ప్రజలను మాయ మాటలతో మభ్యపెడుతూ పక్కదోవ పట్టిస్తున్నారని ప్రతిపక్ష నాయకులు మండిపడ్డారు. అర్హులైన వారికే ఇందిరమ్మ ఇండ్లు సంక్షేమ పథకాలు అందేలా చూడాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో. హత్నూర గ్రామ మాజీ సర్పంచులు. నాయకులు గ్రామస్తులు యువకులు తదితరులు పాల్గొన్నారు.