

జనం న్యూస్ జూన్ 10 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తండ్రి మాజీ శాసనసభ్యులు కీర్తిశేషులు
పల్లా సింహాచలం కుటుంబ సభ్యులను పరామర్శించడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్య ఐటీ శాఖ మాత్యులు నారా లోకేష్ ఈరోజు ఉదయం గాజువాకలో పల్లా శ్రీనివాసరావు స్వగృహమునకు విచ్చేసి సింహాచలం చిత్రపటానికి పువ్వులు సమర్పించి ఘనమైన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు పార్లమెంట్ సభ్యులు భరత్ శాసనసభ్యులు వెలగంపూడి రామకృష్ణబాబు బండారు సత్యనారాయణమూర్తి మేయర్ పీలా శ్రీనివాసరావు మాజీ శాసనమండలి సభ్యులు బుద్ధ నాగ జగదీశ్వరరావు దువ్వారపు రామారావు జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్యబాబు పిఠాపురం మాజీ శాసనసభ్యులు వర్మ పివిజి కుమార్ కోరాడ రాజబాబు గిడ్డి ఈశ్వరి దన్ను దొర బండారు అప్పలనాయుడు తదితరులు పాల్గొని సింహాచలం చిత్రపటానికి నివాళులర్పించారు.