

● మండల ప్రత్యేక అధికారి, డిఎఫ్ఓ సతీష్ కుమార్.
జనం న్యూస్ జనవరి 23(నడిగూడెం):- లబ్ధిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియ అని మండల ప్రత్యేక అధికారి,డిఎఫ్ఓ సురేష్ కుమార్ అన్నారు అన్నారు. గురువారం మండలంలోని చాకిరాల గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో తహశీల్దార్ సరిత తో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారుల ఎంపిక నిరంతరంగా కొనసాగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు అర్హులై ఉండి జాబితాలో లేకుండా ఉంటే గ్రామసభ ల్లోనే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందుతాయన్నారు. ఈనెల 26 నుంచి రైతు భరోసా కింద రూ.12వేలు, భూమి లేని నిరుపేద కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి రూ.12వేలు
వారి ఖాతాలో జమ చేయనున్నట్లు వివరించారు. ప్రతి పథకంలో అర్హులకు చోటు దక్కుతుందన్నారు. ఈ గ్రామసభ లో డి ఎల్ పి ఓ యాదగిరి, జడ్పీ సీఈఓ,పిడి అప్పారావు, ఎంపీడీవో,సయ్యద్ ఇమామ్,
ఎం పి ఓ విజయలక్ష్మి, ఏపీఓ రామలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బూత్కూరి వెంకటరెడ్డి,గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు బి అనిల్ నాయక్, బి అఖిల, ఏ ఈ ఓ లు యం.మౌనిక, యన్.పిచ్చయ్య, గ్రామ పంచాయతీ అధికారులు కే శ్రీను, డి ప్రత్యూష, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.