Listen to this article

జనం న్యూస్ 10జూన్. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా.


తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్,శిశు సంక్షేమ శాఖ,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క ను ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణక్క మంగళవారం రాత్రి హైదరాబాద్ లోని ప్రజాభవనంలో మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క నూతనంగా టీపీసీసీ ఉపాధ్యక్షురాలిగా నియమితులైన సుగుణక్కను శాలువాతో సత్కరించి,శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం మంత్రి సీతక్కను సుగుణక్క శాలువాతో సన్మానించారు.