

జనం న్యూస్ 17 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
సీఎం చంద్రబాబుకి ప్రజలను నమ్మించి మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్య అని మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. సోమవారం ఆయన నివాసంలో రాష్ట్ర ప్రజలకు బాబు వెన్నుపోటు’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయినా ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు.కుట్రలు, కుతంత్రాలలో తప్పుడు కేసులు పెట్టడం తప్పా చేసేందేమీ లేదని విమర్శించారు.