Listen to this article

జనం న్యూస్ 17 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

విజయనగరం జిల్లాలో వర్కింగ్‌ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల్లో 50% ఫీజు రాయితీ కల్పించాలని కోరుతూ కలెక్టర్‌ అంబేడ్కర్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. కలెక్టర్‌ సానుకూలంగా స్పందించి డీఈవోకు ఆదేశాలు జారీ చేశారు.విజయనగరం ప్రింట్‌&ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.