

జనం న్యూస్ 17 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
భరత విద్యార్ధి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో సర్వేలు చెయ్యడం.అనంతరం సర్వేలలో గుర్తించిన సమస్యలను వినతిపత్రం ద్వారా డిఆర్ఓ గారికి తెలియజేయడం జరిగింది.ఈ సందర్బంగా పట్టణ అధ్యక్ష కార్యదర్శులు జి.సూరిబాబు, కే.రాజు లు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు రోజురోజుకి పెరుగుతున్నాయని, దీనిలో భాగంగా బిపిఎం హైస్కూల్లో నీటి సదుపాయం సరిగ్గా అందకపోవడం, మరుగుదొడ్లకు తలుపులు లేకపోవడం గ్రౌండ్ సదుపాయం సరిగ్గా లేకపోవడం ఇలాంటి సమస్యలు గుర్తించమని. అలాగే గాజులు రేగ గర్ల్స్ హైస్కూల్ కు సంబంధించి భవన నిర్మాణం గత ప్రభుత్వం మరియు ప్రస్తుత ప్రభుత్వం నిర్మాణ పనులను పూర్తి చేయకపోవడం. అలాగే కంటోన్మెంట్ హై స్కూల్లో త్రాగునీటి సదుపాయం సరిగ్గా లేకపోవడం, గ్రౌండ్ సదుపాయం లేకపోవడం వంటి సమస్యలు ఉన్నాయని ఈ సమస్యల మీద ఎస్ఎఫ్ఐగా పలుసార్లు వినతుల ద్వారా, ఆందోళన కార్యక్రమాల ద్వారా ప్రజా ప్రతినిధులకు తెలియజేసిన ఇటువంటి స్పందన లేదని ఇలా పట్టించుకోకుండా ఉండటం ద్వారానే గత కొంతకాలంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య అధిక మొత్తంలో తగ్గిపోవడం తదనంతరం పాఠశాలలో మూతపడడం వంటి దుర్ఘటన జరుగుతున్నయి కావున వెంటనే అన్ని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సమస్యలను గుర్తించి పరిష్కారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు గుణ ,శివ ,లోహిత్ తదితరులు పాల్గొన్నారు…