Listen to this article

జనం న్యూస్ జూన్ 17 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అల్లాపూర్ డివిజన్లోని పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి వార్డు ఆఫీస్ నందు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.యూసఫ్ నగర్ స్మశాన వాటిక పరిశీలించి మౌలిక సదుపాయాలకి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు సూచనలు చేశారు.అనంతరం రాజీవ్ గాంధీ నగర్ ప్రాంతాన్ని పరిశీలించి జరుగుతున్న పైప్ లైన్ పనులు పూర్తి చేసి దానిపై మట్టి వేసి ఎక్కడి కక్కడ చెట్లు వేసి సుందరీకరణ చేసే విధంగా మొక్కలు నాటాలని సూచన చేశారు.వార్డ్ ఆఫీసు నందు జరిగిన అధికారులతో సమీక్ష సమావేశంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి కాలనీలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దృష్టికి తీసుకురాగా సంబంధిత అధికారులకు ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లాపూర్ డివిజన్ ఒకప్పుడు ట్రాఫిక్ సమస్య, వర్షం వస్తే బురదతో అస్తవ్యస్తంగా ఉండేదని కానీ నేడు ఎక్కడికక్కడ సిసి రోడ్లు నిర్మించుకుని నీటి పైప్లైన్లు, డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేసుకున్నాం అని అన్నారు.
ఇంకా కొన్ని కొన్ని చోట్ల ఉన్న పెండింగ్ పనులు కూడా త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మైసమ్మ చెరువును అత్యంత సుందరీకరణగా తీర్చిదిద్దేందుకు ఆరవై ఆరు కోట్ల రూపాయలతో పనులు కూడా చేపట్టామని డ్రైనేజ్ వాటర్ ఎట్టి పరిస్థితుల్లో చెరువుల్లో కలవకుండా పటిష్ట ప్రణాళికలు చేపట్టామని తెలిపారు.. సఫ్దర్ నగర్, రాజీవ్ గాంధీ నగర్ ప్రాంతాల్లో కట్ట నిర్మించడం వల్ల అక్కడ నీరు నిలవకుండా ఉంటుందని వర్షాలు వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని తెలిపారు .
బి ఆర్ ఎస్ ప్రభుత్వ పది ఏళ్ల పాలన సమయంలో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ మంత్రి కేటీఆర్ సహకారంతో అల్లాపూర్ లో ముస్లిం, హిందూ స్మశాన వాటికలు.. ఎక్కడికక్కడ కమ్యూనిటీ హాల్స్, పార్కులు, ఇండోర్ స్టేడియంలు, సిసి రోడ్లు, నీటి పైప్లైన్లు డ్రైనేజ్ వ్యవస్థను దాదాపు యనబై శాతము పూర్తి చేసుకోగలిగామని ..ఆనాడు అంత వేగంగా చేసుకోబట్టే ఈరోజు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉందని గుర్తు చేశారు. ఇంకా పెండింగ్ పనులు త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సబియా గౌసుద్దీన్, మేడ్చల్ జిల్లా మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ ,అన్ని విభాగాల అధికారులు.. బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు