Listen to this article

జనం న్యూస్ జూన్ 17 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో

ప్రతీ నిరుపేద కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి ఆదుకుంటుందని ఆర్టీఏ మెంబర్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు లావుడ్య రమేష్ అన్నారు. మండలంలోనీ కొండపల్లి గ్రామానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయి.ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేసారు.లబ్ధిదారులకు మంజూరు పత్రాలను ప్యాక్స్ చైర్మెన్ కర్నతం సంజీవ్ కుమార్ తో కలిసి అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ దశల వారీగా పేదలు అందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామనారు.కార్యక్రమంలో ప్యాక్స్ చైర్మెన్ కర్నతం సంజీవ్ కుమార్, ఎంపిడిఓ శంకరమ్మ,బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుర్గం దేవాజీ,మాజీ ఎంపీటీసీ సభ్యులు మోర్లె రఘుపతి,లక్ష్మణ్,మాజీ సర్పంచ్ గంటూమేర,మోర్లే తిరుపతి,సోనాలే సంతోష్,అజ్మీరా అశోక్,వడై పోషం, మాజీ ఉపసర్పంచ్,గ్రామ పంచాయతీ సెక్రటరీ రవీందర్.కొత్తకొండ రాజు,గ్రామ ప్రజలు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు