

జనంన్యూస్. 17.నిజామాబాదు. ప్రతినిధి.
యోగ దినోత్సవం సందర్భంగా తెలంగాణ మై నారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ (బాలుర) (నాగరం, ధర్మపురి హిల్స్) లలో యోగ అవగాహన, ఆరోగ్య పరీక్షలు,మరియు సామూహిక యోగ ప్రదర్శన నిర్వహించినట్లు జిల్లా ఆయుష్ నోడల్ అధికారి డాక్టర్ జె. గంగాదాస్ గారు తెలిపారు . విద్యార్థులకు యోగ వలన మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, వలన మంచి లాభాలు ఉంటాయని తెలిపారు. యోగ వైద్యులు డాక్టర్ తిరుపతి గారు యోగ శిక్షకుల తో సామూహిక యోగ ఆసనాలు వేయించారు. విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితముగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ సయ్యద్ హైదరు ,సూర్య కాంత్ రెడ్డి,ఉపాధ్యాయులు మరియు ఆయుష్ ఫార్మ సిస్ట్స్ లు పురు షో తం, ఉమాప్రసాద్, యోగ శిక్షకులు విజయ భాస్కర్, రాజేందర్,సిబ్బంది రమేష్, విద్యార్థులు పాల్గొన్నారు.