

జనం న్యూస్ ;17 మంగళవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్
;తొగుట మండలం ఘణపురం ప్రాథమిక పాఠశాలలో పనిచేయుచున్న ఉపాధ్యాయురాలు వనజ మేడం స్నేహితురాలి కూతురు లోహిత రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఘణపురం ప్రాథమిక పాఠశాల విద్యార్థులందరికీ సుమారు రూ. 8000/- విలువ గల నోట్ పుస్తకాలను అందజేయడం జరిగింది. పుట్టినరోజు సందర్భంగా తమ పాఠశాలకు నోట్ పుస్తకాలను అందించిన లోహిత రెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి చంద్రకళ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు లక్ష్మారెడ్డి, వనజ, రవీందర్, రాజ్ కుమార్ మరియు రవి పాల్గొన్నారు.