

జనం న్యూస్ జూన్ 17 ముమ్మిడివరం ప్రతినిధి
తేజస్విని జ్యోతిషాలయం వేదికగా ఫ్రెండ్లీ క్లబ్ వ్యవస్థాపకుని స్వగృహంలో సభ్యుల సహకారం తో ప్రథమ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవస్థాపకుడు ఆకొండి నాగ రవీంద్ర జోగయ్య శాస్త్రిని, ఫ్రెండ్లీ క్లబ్ సభ్యులు పలువురు అభినందించారు. భవిష్యత్తులో సమాజ సేవలో మరిన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సభ్యులు తమ అభిప్రాయం వెలిబుచ్చారు. ఈ సందర్భంగా ఆకొండి ఉమా మహేష్ శర్మ , ఆణివిళ్ళ శ్రీవాణి సుబ్బలక్ష్మి, చల్లా గోపి, తాతపూడి కృష్ణ, మల్లాడి రాధాకృష్ణ, సుంకర పవిత్ర, ఆకొండి శ్రీకాంత్, ఆకొండి కిరణ్, చెరుకు మురళీ, ఆణివిళ్ళ పవన్, ఆణివిళ్ళ ఫణికాంత్, చెరుకు శివయ్య, ఆకొండి ప్రకాశ రావు తదితరులు పాల్గొన్నారు.