

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
ఆంధ్రప్రదేశ్లో బలిజలకు రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఒంగోలు కాపు యువనేత నాసా ప్రసాద్ ,శ్రీ కాళహస్తికి చెందిన రాఘవయ్య తదితరులు చిత్తూరు నుండి అమరావతి వరకు సాగిస్తున్న పాదయాత్ర నందలూరుకు చేరుకుంది.ఈ సందర్భంగా కి నందలూరు బలిజ నాయకులు వాలకు మద్ధతుగా నందలూరు బ్రిడ్జి నుంచి బస్టాండు వరకు పాదయాత్రలో పాల్గోన్ని ప్రసాద్ కి,రాఘవయ్య కి తదితరలకు శాలువలు కప్పి పూలమాలలు వేసి సన్మానించారు.ఈ సందర్భంగా నాసా ప్రసాద్,రాఘవయ్య లు మాట్లాడుతూ CM నారా చంద్రబాబు నాయుడు,DCM పవన్ కళ్యాణ్ నేత్రత్వంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం వెను వెంటనే బలిజలకు రిజర్వేషన్ సౌకర్యాన్ని పునరుద్ధరించాలన్నారు.చిత్తూరు నుంచి కొనసాగిస్తున్న ఈ పాదయాత్ర నెల్లూరు, వెంకటగిరి,రాపూరు,చిట్వేలు,రాజంపేట,నందలూరు మీదుగా సాగిస్తున్న ఈ పాదయాత్ర అమరావతికి చేరుకొని అక్కడ ముఖ్యమంత్రికి,ఉప ముఖ్యమంత్రికి వినతి పత్రాలు ఇస్తామన్నారు.ఈ కార్యక్రమంలో నందలూరు మండలానికి చెందిన బలిజ నాయకులు భారీ ఎత్తున్న పాల్గొన్నారు.