

భద్రాచల తలంబ్రాలు అందుకోవడం అదృష్టమన్న ఎస్పీ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంపిణి: రామకోటి రామరాజు
జనం న్యూస్, జూన్ 18( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)
గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భద్రాచల దేవస్థాన ముత్యాల తలంబ్రాలు పంపిణి చేస్తున్నారు సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు . ఈ సందర్బంగా మంగళవారం నాడు వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్,కి భద్రాచల ముత్యాల తలంబ్రాలు సంస్థ ప్రతినిధులు పూరి సురేష్ శెట్టి అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ భద్రాచల తలంబ్రాలు మాకు అందడం ఎంతో అదృష్టం అన్నారు. అక్కడ ఉన్న పోలీస్ శాఖ వారందరికీ తలంబ్రాలు అందజేశారు.
