

జనం న్యూస్ 18 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
స్వాతంత్య్ర సమరయోధుడు, భారత రాజ్యాంగ విధాన పరిషత్ సభ్యుడు, భారత రత్న సి సుబ్రహ్మణ్య పేరిట నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఇండియా వారిచే అందుకున్న జాతీయ అవార్డు గ్రహీత చిట్టిబాబు తనను తాను చెక్కుకున్న శిల్పి అని రిటైర్డ్ ఐజీ లేళ్ల కాళిదాసు రంగారావు ప్రశంసించారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పౌర సన్మాన వేదిక, దళిత బహుజన శ్రామిక యూనియన్ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ అవార్డు గ్రహీత, డి బీ ఎస్ యు వ్యవస్థాపకుడు పెంకి చిట్టిబాబు కు ఆత్మీయ అభినందన కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. సీనియర్ జర్నలిస్ట్ సీహెచ్ జైరాజ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంకి రిటైర్డ్ ఐజీ ఎల్ కే వీ రంగారావు ముఖ్య అతిథులు హాజరై, అతిథులతో కలిసి చిట్టిబాబు, ఆయన సతీమణి సుదీపాను ఘనంగా సత్కరించారు. అనంతరం రిటైర్డ్ ఐజీ ఎల్ కే వీ రంగారావు మాట్లాడుతూ జాతీయ అవార్డు గ్రహీత చిట్టిబాబు తనను తాను చెక్కుకున్న శిల్పి , సామాజిక ఉద్యమాలలో అనేక అవరోధాలు ఎదుర్కొంటూ రాజ్యాంగ విలువలకు లోబడి బడుగు బలహీన వర్గాల ప్రజల హక్కుల పరిరక్షణకు చిట్టిబాబు చిత్తశుద్ధితో పనిచేయడం అభినందనీయమని అన్నారు. సమాజంలో వివక్షతకు గురవుతున్న ప్రజల పక్షాన వివక్షత లేని సమాజం వైపు పయనించే నాయకులలో చిట్టిబాబు ప్రముఖుడని అందుకే అవార్డు ఆయనను వెతుక్కుంటూ వచ్చిందని తెలిపారు. నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఇండియా ద్వారా సి సుబ్రహ్మణ్యం జాతి అవార్డు పొందుకోవడం సమాజంలో పనిచేస్తున్న అనేక మందికి స్ఫూర్తిదాయకమని చెప్పారు. ఈ సందర్భంగా తెలుగులో ప్రచురించిన భారత రాజ్యాంగ పుస్తకాన్ని ముఖ్య అతిథి రిటైర్డ్ ఐజీ ఎల్ కే వీ రంగారావు తన చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య విశిష్ట, గౌరవ అతిధులుగా హాజరైన ప్రముఖులు అంతా తొలుత భారత రత్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు వీఎస్ ప్రసాద్, డాక్టర్ ఎం వెంకటేశ్వర రావు, ఏటీకే ప్రతినిధి ఎండీ అహమ్మద్, లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షులు బీశెట్టి బాబ్జీ, ప్రముఖ సామాజిక వేత్త డాక్టర్ తెన్నేటి జైరాజ్, జెవీవీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎంవీ ఆర్ కృష్ణాజీ, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక అధ్యక్షుడు శ్రీనివాస్ రావు, సీపీఎం ప్రతినిధి రెడ్డి శంకరరావు, రాష్ట్ర డీలర్ల సంఘం అధ్యక్షుడు బుగత వెంకటేశ్వర రావు, తెర్లాం జెడ్పీటీసీ ప్రతినిధి గర్భాపు రామారావు, ఏంఈఎఫ్ జిల్లా అధ్యక్షులు పెంకి ఇజ్రాయెల్ తదితర ప్రముఖులు అంతా చిట్టిబాబు సమాజానికి చేస్తున్న సేవలను కొనియాడారు. దళిత, ఆదివాసి బహుజనులు, బాలల, మహిళల హక్కులు కోసం పోరాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తున్న చిట్టిబాబు సేవలు చిరస్మరణీయమని ప్రశంసించారు. బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఆయన చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ జాతీయ అవార్డు రావడం అభినందనీయమని తమ హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమానికి గౌరవ అతిధులుగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు సురగాల చిట్టిబాబు, జమాత్ ఈ ఇస్లామి హింద్ ప్రెసిడెంట్ ఎండీ హబీబ్, ఎపిడబ్ల్యు జె ఎఫ్ ప్రతినిధి అప్పారావు, ట్రిపుల్ ఈ సంస్థ ఏండీ వెన్నెల చంద్ర శేఖర్, రొంపిల్లు ఎంపీటీసీ బవిరెడ్డి శంకర్ రావు, చీపురుపల్లి ఎంపీటీసీ కే దాలయ్య, గరివిడి మాజీ ఎంపీటీసీ కే రవి, ఏం ఆర్ పి ఎస్ నాయకులు యందవ నారాయణరావు, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు బసవ సూర్యనారాయణ, ఉత్తరాంధ్ర దళిత ఐక్య వేదిక అధ్యక్షుడు ఆదాడ మోహన్ రావు, ఏఐసీసీ డ్రిస్ట్రిక్ ప్రెసిడెంట్ డాక్టర్ పి ప్రేమానందం, అంబేద్కర్ అందరివాడు సాధన సమితి అధ్యక్షుడు బొంగ భానుమూర్తి, ఎస్సీ కార్పొరేషన్ సీనియర్ అసిస్టెంట్ ఎస్ సత్యనారాయణ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘ నాయకులు జి అప్పల సూరి, డీబి ఎస్ యు విశాఖ జిల్లా ప్రతినిధి కాటపల్లి అప్పారావు తదితరులు హాజరై చిట్టిబాబును ఘనంగా సత్కరించారు. ఆహ్వాన కమిటీ సభ్యులు జాన్ కెనడీ, ఎం సూర్య చంద్ర, ఎంపీ రాజు, కే వరలక్ష్మి, కడారీ జై శంకర్, ఆర్ ఈశ్వర్ రావు, యు రాము, వై పోలయ్య, ఎస్ పైడిరాజు, జి గొల్లబాబు, వి కార్తీక్, జి సుందర్ రావు, టి చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.