

శాయంపేట న్యూస్,తేది:16-06-2025. జనం న్యూస్ జూన్ 18 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి
శాయంపేట మండల కేంద్రంలో ఎంఆర్ పీ ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం మండల ఇన్చార్జి మామిడి భాస్కర్ మాదిగ ఆధ్వర్యంలో జరిగింది.సమావేశానికి ముఖ్య అతిథులుగా హనుమకొండ జిల్లా ఇన్చార్జి కందుకూరి సోమన్న మాదిగ, కో– ఇంచార్జి ఎంఎస్ పీ జాతీయ అధ్యక్షులు చిప్పలపల్లి సోమశేఖర్ మాదిగలు హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూఎస్ సీ వర్గీకరణ సాధించిన అనంతరం మందకృష్ణ మాదిగ ఇచ్చిన ప్రత్యేక కార్యాచరణను మండలంలోని ప్రతి గ్రామ గ్రామాన అమలు చేయాలని ప్రతి గ్రామంలో ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాలకు నూతన కమిటీలను నిర్మాణం చేసి జులై 7న ఎమ్మార్పీఎస్ 31వ వార్షికోత్సవాన్ని జన జాతరల మాదిగలు జరుపుకోవాలని అందుకు ఇప్పటినుండే జెండా గద్దెల నిర్మాణాన్ని పూర్తి చేయాలని పిలుపునిచ్చారు.మందకృష్ణ మాదిగ కి పద్మశ్రీ అవార్డు జాతికి దక్కిన గౌరవం ఇప్పుడు మరింత బాధ్యత పెరిగింది నూతన కమిటీల ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణములుకై సిద్ధపడాలని కోరారు.పరిధిలోని ప్రతి గ్రామంలో కార్యాచరణ అమలుకై మండల ముఖ్య నాయకులకు పని విభజన చేశారు.అనంతరం జిల్లా ఇంచార్జీ, కో–ఇంచార్జీలకు మండల నాయకులు సన్మానం చేశారు.సమావేశంలో ఎంఎస్ పీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు బండారి సురేందర్ మాదిగ, ఎంఆ ర్ పీఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు గద్దల సుకుమార్ మాదిగ, ఎంఎస్ పీసీనియర్ నాయకులు అరికెళ్ల దేవయ్య మాదిగ,ఎంఎస్ఎఫ్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ముక్కెర ముఖేష్ మాదిగ, కొగిల జగన్ మాదిగ, దైనంపల్లి సుమన్ మాదిగ, మారపల్లి క్రాంతి మాదిగ, మారపల్లి రాజేందర్ మాదిగ, మారపల్లి రాజు మాదిగ, మారపల్లి చిరంజీవి మాదిగ తదితరులు పాల్గొన్నారు.