

జనం న్యూస్ జూన్ 19(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
హమాలీ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డులు ఏర్పాటు చేయాలని సిఐటియు సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ఎం రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం మండల కేంద్రంలోని వివిధ రైస్ మిల్లులో పనిచేస్తున్న హామాలి కార్మికుల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ.. సంఘటిత అసంఘటిత రంగంలలో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారానికి జూలై 29న దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో 10 కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు,అసోసియేషన్లు పాల్గొంటున్నాయని.ఈ సమ్మెలో హమాలీ కార్మికులు కూడా పాల్గొనాలని కేంద్రంలో బిజెపి ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను కుదించి నాలుగు లేబర్ కోడ్ లను తేవడం వలన కార్మిక హక్కులను హరించి వేస్తుందని అన్నారు ఈ విధానాలకు వ్యతిరేకంగా జులై 29న జరుగు దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం, హమాలి యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు అనంత మైసయ్య గౌడ్, వేట అంజయ్య,జానయ్య, సాలయ్య,రాంబాబు,నాగయ్య,రవి,శ్రీను,సోమశేఖర్,తదితరులు పాల్గొన్నారు.