

జనం న్యూస్ జూన్ 18 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
అనకాపల్లి దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో 2000 మంది విద్యార్థులతో యోగా డే వేడుకలను కళాశాల చైర్మన్ దాడి రత్నాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులచే యోగా ట్రైనర్ ద్వారా యోగాసనాలు చేయించారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడుతూ జూన్ 21వ తారీఖున విశాఖ బీచ్ రోడ్ నందు రాష్ట్ర ప్రభుత్వంచే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమానికి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ , రాష్ట్ర ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రినారా లోకేష్ పాల్గొంటున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులందరూ పాల్గొని ప్రపంచ రికార్డు నెలకొల్పి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించాలని అన్నారు. నిత్యజీవితంలో యోగాసనాలను నిత్యం భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యంతో పాటు, మానసిక ప్రశాంతత, విద్యా ఉద్యోగాల్లో రాణించగలుగుతారని అన్నారు. విద్యార్థి దశ నుండే ప్రతి విద్యార్థి యోగాను అలవాటు చేసుకోవాలని యోగాసనాల ద్వారా అనేక దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని అన్నారు. ఆడవారు మగవారు బేధం లేకుండా ప్రతి ఒక్కరూ యోగ అభ్యసముపై అవగాహన కలిగి ఆరోగ్యవంతులుగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎండిఓ పి ఆశాజ్యోతి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ వైకుంఠరావు,అధిక సంఖ్యలో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.//