

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో విద్యార్ధులకు హైస్కూల్ కమిటీ చైర్మన్ ఉపేంద్ర, ప్రధానో పాధ్యాయులు శ్రీనివాసులు ఆధ్వర్యంలో విద్యార్థులకు సర్వేపల్లి విద్యామిత్ర కిట్లు పంపీణి కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధులుగా ఎం.ఈ వో లు నాగయ్య,అనంత కృష్ణయ్య ,నందలూరు మండల జనసేన నాయకులు కొట్టే శ్రీహరి విద్యార్థులకు సర్వేపల్లి విద్యమిత్ర కిట్లు బ్యాగ్ లు,పుస్తకాలు అందజేయడం జరిగింది. NDA ప్రభుత్వం విద్యర్థులకు అందిస్తున్న సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్య మిత్ర కిట్లు చాలబాగున్నాయి,నాణ్యతలో NDA ప్రభుత్వం ఎక్కడ రాజీ పడకుండా ఇవ్వడంతో విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.అలాగే విద్యా సంవత్సరం ప్రారంభ దశల్లోనే NDA ప్రభుత్వం తల్లికి వందనం క్రింద ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అందరికి రు.13,000 ఇవ్వడంతో విద్యార్థులకు,
తల్లిదండ్రుల ఆనందంకు అవధులు లేకుండా పోయాయి.ఈ కార్యక్రమంలో హైస్కూల్ ఉపాధ్యా యులు,విద్యార్థి విద్యార్లులు పాల్గొన్నారు.
