

జనం న్యూస్ జూన్ 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
కొల్లేరు సమస్యలపై సుప్రీం కోర్టు నియమించిన కేంద్ర సాధికార కమిటీ సభ్యులు ఈరోజు కొల్లేరు ప్రాంత పర్యటనకు, ఈ ప్రాంత సమస్యలపై ప్రజల నుండి వినతులు స్వీకరించేందుకు వచ్చిన సందర్భంగా కైకలూరు ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో పాల్గొని కొల్లేరు ప్రాంత ప్రజల సమస్యలను కమిటీ సభ్యులకు వివరించడం జరిగింది. సుప్రీమ్ కోర్ట్ నియమించిన ప్రత్యేక అధికారుల బృందం, మరియు ఉండి శాసనసభ్యులు రఘురామ కృష్ణంరాజు , సమావేశం లో పాల్గొన్నారు అనంతరం విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. వేద పండితులతో ఆశీర్వచనం తీసుకున్నారు