

జనం న్యూస్ 19 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
జిల్లా పర్యటనలో భాగంగా ఏపీ పీసీసీ అధ్యక్షురాలు.Y.S షర్మిల బుధవారం విజయనగరం చేరుకున్నారు. స్థానిక మెసానిక్ టెంపుల్లో గురువారం ఉ.10 గంటలకు జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు అనుసరించాల్సిన ప్రణాళికలను షర్మిల వివరించనున్నారని జిల్లా అధ్యక్షుడు మరిపి విద్యాసాగర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు.