

జనం న్యూస్ జూన్ 19 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
2024 ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లు పరిమితం చేసినందుకు ఓటర్లపై కక్ష తీర్చుకోవడానికి జగన్ రెడ్డి యాత్రలు సాగుతున్నాయని, శత్రు మూకలు పై దండయాత్ర చేసినట్లు, వందల వాహనాలతో మంది మార్బలంతో భయాందోళన సృష్టిస్తూ, జగన్ రెడ్డి శవయాత్రలు సాగుతున్నాయని తెలుగుదేశం పార్టీ మాజీ శాసనమండలి సభ్యులు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ధ నాగ జగదీశ్వరరావు పార్లమెంట్ కార్యాలయంలో ఈరోజు ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో జగన్ రెడ్డి పై విరుచుకుపడ్డారు. సత్తెనపల్లి ప్రజలను భయపెట్టడానికి పొట్టేలును నరికినట్లు రా నరుకుతాం నా కొడకల్లారా, గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్లు రఫ్ఫా రఫ్ఫా నరుకుతామని, రాజారెడ్డి రాజ్యాంగాన్ని పల్నాడు నుండే మొదలు పెడతామని పల్నాడు జగన్ రెడ్డి అడ్డా అని ఎవరు ముందుకు వచ్చిన నరుకుతామని బహిరంగంగా ప్రకటనలు చేస్తూ, ఫ్లెక్సీలు, నినాదాలు అరుపులు కేకలు వాహనాలతో ఎదురు వచ్చిన వారిని గుద్దుకుంటూ ఇద్దరు జీవితాలతో జగన్ రెడ్డి చలగాటమాడి కనీసం వారి కుటుంబ సభ్యులనే పరామర్శించడానికి తీరుబాటు లేకుండా అధికార పార్టీపై అవాకులు చవాకులు, పోలీసులను బెదిరించడం, రెండు మూడేళ్లు అధికారంలోకి వస్తామని అందరి సంగతి చూస్తామని, కొంతమంది పోలీసు అధికారులకు సినిమా చూపిస్తామని తెగ ఉబలాడుతున్నాడని, జగన్ రెడ్డి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించి వైసిపి కార్యకర్తలకు ధైర్యాన్ని నూరు పోస్తున్నాడని నాగ జగదీష్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఓడిపోయిన పార్టీ బాధ్యతలు వహించి ప్రజా సమస్యలపై పోరాటం చేయవలసిన బదులు, కుల రాజకీయాలు, ప్రాంతీయంగా రెచ్చగొడుతూ తన పార్టీ కార్యకర్తలకు డబ్బులు మద్యం, వాహనాలకు పెట్రోల్ ఇచ్చి తన బలంగా శునకానందం పొందుతున్నారని, ఇది వాపు తప్ప బలం కాదని జగన్ రెడ్డి తెలుసుకోవాలని నాగ జగదీష్ హితువు పలికారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో రెంటపాళ్ళ గ్రామంలో వైసిపి నాయకుడిగా చలామణి అవుతూ 2024 ఎన్నికల్లో జగన్ రెడ్డి మాటలు నమ్మి 175 కి 175 వస్తాయని జగన్ రెడ్డి పై విశ్వాసంతో కోటి యాభై లక్షలు బెట్టింగులు కాసి డబ్బులు పోగొట్టుకొని కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నాడని జూన్ 5న జరిగిన సంఘటన జగన్ రెడ్డి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన దానికి కూటమి ప్రభుత్వంపై చంద్రబాబుపై ఆరోపణలు చేయడం జగన్ రెడ్డికి అలవాటుగా మారిందని, ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడని, జగన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలను వైసీపీని జగన్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదని రానున్న స్థానిక సంస్థలు ఎన్నికలు మరోసారి జగన్ రెడ్డికి సినిమా చూపించడానికి ప్రజల సిద్ధంగా ఉన్నారని నాగ జగదీష్ అన్నారు. ఈ కార్యక్రమంలో కాండ్రేగుల సత్యనారాయణ కుప్పిలి జగన్ మల్ల గణేష్ కాండ్రేగుల రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.//