

పంటను బ్రతికించడానికి మొక్క మొక్క కు నీళ్లు
జనం న్యూస్,జున్ 19,కంగ్టి
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని వాలముర్ శివర్లో పత్తి పంట సాగు చేస్తున్న వ్యవసాయ రైతు కాపార్తి ఆంజనేయులు, గురువారం పత్తి మొక్కలకు కూలీల ద్వారా నీళ్లు పోయిస్తున్నారు.ఈ సందర్భంగా రైతు ఆంజనేయులు మాట్లాడుతూ దుక్కి దున్ని రీతి చేసి ఉంచిన పంట చేలలో మండలంలో వర్షం ఆధారిత పంటలు ఎక్కువగా పండించే రైతులు మొదటగా కురిసిన వర్షాలకు విత్తనాలు విత్తుకోగా మొలకెత్తిన అనంతరం వర్ణుడు ముఖము చాటేయడంతో పంటను బ్రతికించే కొరకై రైతులు పడుతున్న పాట్లు చెప్పలేనంతవి అని అన్నారు. ఒక ట్యాంకర్ నీటిని సుమారు 4000 వేల రూపాయలు, కూలీలకు ఒక్కరికి 400 రూపాయలతో పత్తి బ్యాగులు,మందు సంచులు,విత్తనం నాటే వారి కూలీలు ఎకరాకు సుమారు పదివేల రూపాయల పెట్టుబడి పెట్టవలసి వస్తుందని అన్నారు.పుట్టిన పిల్లలకు ఏ రకంగా అయితే కాపాడుకోవడానికి కన్న తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తూ ఉంటారో ఆ మాదిరిగానే పంటను బ్రతికించుకోనేదుకు రైతులు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.