

మద్నూర్ జూన్ 18 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లి మండలంలో పొతంగల్ సిర్పూర్ గ్రామం నుండి అక్రమంగా తరలిస్తున్న ఒక ఇసుక ట్రాక్టర్ లింబూర్ నుండి తడి హిప్పర్గా మధ్యలో డోంగ్లి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయిబాబా ఆ టాక్టర్ ను పట్టుకుని అనుమతి పత్రాలు లేనందున ఆ ట్రాక్టర్ను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది ఎవరైనా మంజీరా నది నుంచి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్ఐ సాయిబాబా హెచ్చరించారు