Listen to this article

జనం న్యూస్ జూన్ 19 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

మూసాపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(బాలురు) భవనంలో అదనపు అంతస్తు నిర్మించాలని కోరుతూ కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో మూసాపేట్ మాజీ కార్పోరేటర్ తూము శ్రావణ్ కుమార్ మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి ని కలిసి వినతిపత్రం సమర్పించారు. విద్యార్థులు ఇరుకు గదుల్లో విధ్యనభ్యసిస్తున్నారని, గత మూడు సంవత్సరాలుగా పలుమార్లు ఈ విషయం పై వినతిపత్రం సమర్పించినా ఇప్పటి వరకు ఎలాంటి ముందడుగు లేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.విద్యార్థుల ప్రయోజనం దృష్ట్యా సమస్యను పరిగణలోకి తీసుకొని సాధ్యమైనంత త్వరగా అదనపు అంతస్తు నిర్మాణం చేపట్టాలని విన్నవించారు.