Listen to this article

జనం న్యూస్ జూన్ 23 ముమ్మడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ


యూత్ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ ఫెడరేషన్ ఇండియా నిర్వహించిన ఆల్ ఇండియా నేషనల్ ఛాంపియన్షిప్ 2025 లో సత్తా చాటిన విద్యార్థులు

గోవాలో జరిగిన యూత్ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా నేషనల్ ఛాంపియన్షిప్ 2025 వారు జూన్ 13 నుండి 15 వరకు నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ లో కొత్తపల్లి ఆదర్శ స్కూల్ విద్యార్థులు పాల్గొని వివిధ కేటగిరి లో విజయం సాధించారు పాఠశాల హెడ్మాస్టర్ సత్యనారాయణ అన్నారు. ఆదర్శ స్కూల్ pet రవి మాట్లాడుతూ మా ఆదర్శ విద్యార్థులు వివిధ విభాగాలలో పాల్గొని అండర్ 14 విభాగంలో సింగిల్స్ ఫస్ట్ ప్లేస్ ఆర్ దుర్గాప్రసాద్ అండర్ 14 డబల్ విభాగంలో ఆర్ దుర్గాప్రసాద్, సెకండ్ ప్లేస్ సాధించారు మరియు అండర్ 17 సింగిల్స్ విభాగంలో ఆర్ రాజ్ కుమార్ ఫస్ట్ ప్లేస్ అండర్ 19 సింగిల్ విభాగంలో ఆర్ ప్రవీణ్ సెకండ్ ప్లేస్ విద్యార్థులుగా సాధించారు. ఆదర్శ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ డాక్టర్ త్రినాధరావు మాట్లాడుతూ కళాశాలకు జాతీయ స్థాయిలో ర్యాంకుల రావడం జరిగిందని అలాగే ఆదర్శ స్కూల్ విద్యార్థులు ఆటలలో బ్యాట్మెంటన్ విభాగంలో జాతీయస్థాయిలో ప్రథమ స్థానం సాధించడం వీరి యొక్క కృషికి నిదర్శనమని తెలియజేశారు. కోఆర్డినేటర్ శ్రీనివాస్ మాట్లాడుతూ బ్యాట్మెంటన్ వివిధ కేటగిరీలో విజయం సాధించి నేడు పాఠశాలకు వచ్చిన విద్యార్థుల యొక్క సర్టిఫికెట్స్ మరియు మెడల్స్ చూసి వీరు ఇటువంటి విభాగంలో అత్యున్నత శిఖరాలకు ఎదగాలని అన్నారు. విషయం తెలిసిన ఆదర్శ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ కనకరాజు మరియు సెక్రెటరీ నాగమణి డైరెక్టర్స్ హారిక సంతోష్ మరియు ప్రవళిక సంతోష్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక బృందం పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క కృషికి అభినందనలు తెలియజేశారు.