Listen to this article

జనం న్యూస్ జనవరి 24 కుకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- సమస్యలపై ప్రజల పక్షాన కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పోరాటం చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వారితో పాటు, తమను అక్రమ నిర్బంధం చేస్తుందని మూసాపేట్ మాజీ కార్పోరేటర్ తూము శ్రావణ్ కుమార్ అన్నారు. హౌసింగ్ బోర్డు లో మిగిలిన స్థలాలను ప్రభుత్వం అశాస్త్రీయంగా, మాస్టర్ ప్లాన్ ను పట్టించుకోకుండా వేలంపాట నిర్వహిస్తున్న తరుణంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తన నిరసన వ్యక్త పరచాలనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం, బిఆర్ఎస్ శ్రేణులను అక్రమ నిర్బంధాలు చేస్తుందని అన్నారు.ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేయడం కూడా తప్పేనా ?ప్రతిపక్ష పార్టీగా సమస్యలపై పోరాడకూడదా? అని ఆయన ప్రశ్నించారు. ప్రజా పాలనా అని గొప్పలు చెప్పుకొంటున్న ఈ ప్రభుత్వం కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం అయ్యిందని దుయ్యబట్టారు.ప్రతిసారి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు సరైన సమయంలో మంచి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు