Listen to this article

బిచ్కుంద జూన్ 21 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ బిచ్కుంద లో సీసీఈ మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ I మరియు II విభాగం వారి ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ యోగా గొప్పతనాన్ని సంపూర్ణ ఆరోగ్యం మరియు మానసిక ఒత్తిడిని జయించవచ్చు అని ప్రస్తుత జీవన విధానంలో యోగాను తప్పక పాటించాలని అలవర్చుకోవాలని సూచించారు కార్యక్రమంలో అధ్యాపకులు అందరూ సూర్య నమస్కారాలతో పాటు కొన్ని యోగాసనాలు కూడా వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు