

జనం న్యూస్ జూన్ 21 నడిగూడెం
నడిగూడెం మండల పరిధిలోని సిరిపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల-2 ఆవరణలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం విద్యార్థుల చేత కొన్ని రకాల ట్రిప్స్ ఆసనాలు వేయించి,మెడిటేషన్ చేయించారు.విద్యార్థులు చదువులో రాణించాలంటే ప్రతినిత్యం యోగా,మెడిటేషన్ చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బుర్రి శ్రీనివాసరావు,స్కూల్ టీచరు కె.సుజాత,పాఠశాల సిబ్బంది కె.శ్రీలత,యం.మణెమ్మ, అంగన్వాడీ టీచరు నేలమర్రి శైలజ,విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.