

జనం న్యూస్ జూన్ 23 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం తాళరేవు మండలం
యువత క్రికెట్తో పాటు ఇతర క్రీడాల్లోనూ రాణించాలని భాజపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. పటవల జడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో దాసరి రవిరాజు మెమోరియల్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్న మెంట్ ఆదివారంతో ముగిసింది. 46 జట్లు పాల్గొనగా ఫైనల్లో సీతారామపురం, గొర్రిపూడి జట్లు తలపడ్డాయి. సీతారామపురం జట్టు విజేతగా, గొర్రిపూడి జట్టు ద్వితీయ స్థానంలో నిలిచాయని నిర్వా హకుడు చెక్కా అజయ్ వర్మ తెలి పారు. ఆదివారం మధ్యాహ్నం రెండు జట్లకు భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ ఎమ్మెల్యే చెల్లె వివేకానంద, దాట్ల పృథ్వీరాజు, బిజెపి జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, బిజెపి స్టేట్ ఉపాధ్యక్షులు వేటుకూరు సూర్యనారాయణ రాజు, ముమ్మిడివరం అసెంబ్లీ కన్వీనర్ గొల్ల కోటి వెంకటరెడ్డి, బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ, కనకారావు తదితరులు ట్రోఫీలు అంద జేశారు. యనమండ్ర విజయకుమార్, ధూళిపూడి వెంకటరమణ, పొన్నమండ రామలక్ష్మి, మేడిశెట్టి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

