

AIYF రాష్ట్ర ఉపాధ్యక్షులు CPI సుభాని
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 24 రిపోర్టర్ సలికినిడి నాగరాజు:- బాపట్ల జిల్లా సూర్యలంక దగ్గర మత్యకారుల నివాస ప్రాంతాల్లో ఎటువంటి పర్మిషన్స్ లేకుండా అనధికారికంగా రిసార్ట్స్ నిర్వహిస్తూ ఆసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుస్తున్నారని AIYF రాష్ట్ర ఉపాధ్యక్షులు CPI సుభాని విమర్శించారు. బాపట్ల జిల్లా సీపీఐ కార్యదర్శి తన్నీరు సింగరకొండతో కలిసి మత్యకారులు చేస్తున్న ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ బాపట్ల జిల్లాలో పర్యాటక కేంద్రంగా విరాసిల్లుతున్న సూర్యలంక బీచ్ కు కుటుంబ సమేతంగా పర్యాటకులు వస్తున్నారని, కొంతమంది ధనార్జనే ధ్యేయంగా ప్రభుత్వ స్థలాల్లో రిసార్ట్స్ ఏర్పాటు చేసి ఆసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తూ మత్స్యకారుల కుటుంబాలకు ఆటంకం కలిగిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని,లేని యెడల స్థానికులతో కలిసి పోరాటానికి సిద్దమౌతామని తెలిపారు.