Listen to this article

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపీఎస్

జనం న్యూస్ 23 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

విజయనగరం జిల్లాలో గంజాయి అక్రమ రవాణ, విక్రయాలు, వినియోగంను నియంత్రించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం చెక్ పోస్టులు ఏర్పాటు, డైనమిక్ వాహన తనిఖీలు చేపట్టడం, అక్రమ రవాణకు బాధ్యులైన ప్రధాన నిందితులను గుర్తించి, వారిని కేసుల్లో నిందితులుగా చేర్చడం, గంజాయి వ్యాపారాలతో కూడబెట్టిన అక్రమ ఆస్తులను సీజ్ చేయడం, వారిపై హిస్టరీ షీట్లు ప్రారంభించి నిఘా పెట్టడం, గంజాయి వినియోగం వలన కలిగే అనర్ధాలను ప్రజలకు వివరించి, వారిని చైతన్యపర్చడం వంటి బహుముఖ వ్యూహాలను అమలు చేస్తూ, గంజాయిని కట్టడి చేస్తుందని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జూన్ 22న తెలిపారు.
జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మాట్లాడుతూ – జిల్లాలో గంజాయి అక్రమ రవాణ, విక్రయాలు, వినియోగంను నియంత్రించేందుకు బహుముఖ వ్యూహాలను అమలు చేసి, సత్ఫలితాలు సాధించామన్నారు. అక్రమ రవాణను నియంత్రించేందుకు ప్రధాన మార్గాలను గుర్తించి, ఆయా మార్గాల్లో నాలుగు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, నిరంతరం వాహన తనిఖీలు చేపడుతున్నామన్నారు. అంతేకాకుండా, ప్రతీ రోజూ ఆయా మార్గాల్లో ఆకస్మికంగా 10 చోట్ల డైనమిక్ వాహన తనిఖీలు చేపడుతున్నామన్నారు. గంజాయి అక్రమ రవాణ చేస్తూ పట్టుబడిన నిందితులను అరెస్టు చేయడమే కాకుండా, అందుకు బాధ్యులైన ప్రధాన వ్యక్తులను కూడా నిందితులుగా చేర్చి, వారిని అరెస్టు చేస్తున్నామన్నారు. గంజాయి వ్యాపారాలు సాగించే వ్యక్తులను గుర్తించి, వారిపై హిస్టరీ షీట్లు తెరిచి, వారి కదలికలపై నిఘా పెడుతున్నామన్నారు. గంజాయి అక్రమ రవాణ, విక్రయాలను ప్రధాన వ్యాపారాలుగు సాగించే వ్యక్తులు కూడబెట్టిన అక్రమ ఆస్తులను గుర్తించి, వాటిని అటాచ్ చేస్తున్నామన్నారు. గంజాయి వినియోగం వలన కలిగే అనర్ధాలను విద్యార్థులు, యువత, ప్రజలకు ‘సంకల్పం’ కార్యక్రమాలతోను, ప్రచార రధంతో విస్తృతంగా ప్రచారం చేస్తూ, ప్రజల్లో చైతన్యం నింపుతున్నామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. గత సంవత్సరంలో గంజాయి అక్రమ రవాణకు పాల్పడుతున్న వారిపై 88 కేసులు నమోదు చేసి, 2,157 కిలోల గంజాయి, 78 గ్రాముల నల్లమందును, అక్రమ రవాణకు వినియోగించిన 30 వాహనాలను సీజ్ చేయడంతో పాటు, 288మంది నిందితులను అరెస్టు చేసామన్నారు. అదే విధంగా ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 52 కేసులు నమోదు చేసి, 346 కిలోల గంజాయి, అక్రమ రవాణకు వినియోగించిన 21 వాహనాలను సీజ్ చేయడంతోపాటు, 155మంది నిందితులను అరెస్టు చేసి, రిమాండుకు తరలించామని జిల్లా ఎస్పీ తెలిపారు. గంజాయి నేరాలను తీవ్రంగా పరిగణించి, ఆయా కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేయడంతోపాటు, కోర్టు విచారణలో ఉన్న కేసుల్లో ప్రాసిక్యూషను
ఎప్పటికప్పుడు గమనిస్తూ, సాక్ష్యాధారాలను ప్రవేశపెడుతూ, నిందితులు శిక్షింపబడే విధంగా చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.