Listen to this article

జనం న్యూస్ 23 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర హైకోగ్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్‌ జడ్జి జస్టేస్‌ చీమలపాటి రవితో ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఆదివారం భేటీ అయ్యారు. విజయనగరం జిల్లా కోర్టులో నిర్వహించే న్యాయ సమీక్షకు హాజరైన ఆయనను మర్యాదపూర్వకంగా కలసి, పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం శాంతి భద్రతలకు చేపడుతున్న చర్యలను ఎస్పీ వివరించారు.