

(జనం న్యూస్ చంటి జూన్ 22)
ఈరోజు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం రాయపోలు మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ జెండా గద్దె భూమి పూజ మరియు గ్రామ కమిటీ నిర్మాణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఎంఎస్పి జాతీయ నాయకులు మంద కుమార్ మాదిగ హాజరై మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పీడిత వర్గాలను ఏకం చేద్దాం, అసమానతలు లేని నూతన సమాజ నిర్మాణమే లక్ష్యంగా ముందుకు నడుద్దాం అన్నారు
జులై 7న మాదిగల ఆత్మగౌరవ ప్రతీకైన ఎమ్మార్పీఎస్ జెండా ప్రతి గ్రామంలో ఎగరాలని పిలుపునిచ్చారు. విద్యా , ఉద్యోగాల్లో వర్గీకరణ ఫలాలు అందుకునే విధంగా మాదిగ విద్యార్థులు నైపుణ్యం పెంచుకోవాలి అన్నారు.78 యేండ్ల స్వతంత్ర భారతదేశంలో 30 ఏళ్లుగా సజీవంగా నిలబడి లక్ష్యాన్ని ముద్దాడిన ఏకైక సామాజిక ఉద్యమం ఎమ్మార్పీఎస్ మాత్రమే అని, ఈ ముప్పై ఏళ్ల కాలంలో దండోరా జెండా మాదిగల వరకే పరిమితం కాకుండా సమస్త పీడిత అణగారిన వర్గాలకు అండగా నిలిచిందని అన్నారు
ఎమ్మార్పీఎస్ మాదిగల కోసమే ఏర్పాటు చేసిన, మాదిగల వరకే పరిమితం కాలేదని ఈ సమాజంలో పీడింపబడుతున్న ప్రతివర్గం పక్షాన నిలబడి తన పోరాటాలను నిర్వహించిందని, పాలకులు విస్మరించిన, ప్రతిపక్షాలు, పార్టీలు పట్టించుకోని సమస్యలను ప్రజల పక్షాన ఎజెండాగా చేసుకుని పాలకుల మెడలు వంచి అనేక సంక్షేమ పథకాలను ఫలితాల రూపంలో సమాజానికి అందించిందని అన్నారు. ఆరోగ్య శ్రీ అయిన, వికలాంగుల పెన్షన్లైన, వృద్ధులు వితంతువుల పెన్షన్లైన, ఆకలి కేకల పోరాటంతో రేషన్ కోట బియ్యం పెంపైన, ఫాస్ట్ ట్రాక్కోర్టులైన ఇలా ప్రతి వర్గం పక్షాన నిలబడి సమాజం పట్ల తన బాధ్యతను నిర్వర్తించిందని గుర్తు చేశారు.ఇప్పుడు అంబేద్కర్ గారు ఉన్నప్పటి నుండి నేటి వరకు మిగిలి ఉన్న సమస్యల పరిష్కారం కోసం పీడిత వర్గాలను ఏకం చేసి దేశవ్యాప్త ఉద్యమాన్ని ఎమ్మార్పీఎస్ నిర్మిస్తుందని అన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన ఎస్సీ రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన అందక పోవడం వల్లనే మాదిగలు అన్ని రంగాల్లో వెనుకబడిపోయారు. కనుక జనాభా ప్రాతిపదికన ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరించాలని మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ముప్పై ఏళ్ళు రాజీలేని పోరాటం సాగిందని, ఆ పోరాట ఫలితంగానే నేడు తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ చట్టం అమలులోకి వచ్చిందని, దాని ద్వారా మాదిగలకు 9% రిజర్వేషన్లు దక్కాయి. ఎన్నో త్యాగాల ద్వారా సాధించుకున్న రిజర్వేషన్ ఫలాలు మాదిగ విద్యార్థులు నిరుద్యోగులు అందిపుచ్చుకొని అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి రావాలని, అందుకోసం వర్గీకరణ ఫలాలు అందుకునే విధంగా మాదిగ విద్యార్థులు నైపుణ్యం పెంచుకోవాలి కోరారు.ఈ దేశంలో 100% సక్సెస్ రేట్ ఉన్న ఏకైక నాయకుడు మందకృష్ణ మాదిగ గారేనని, వారి సారథ్యంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అసమానతలు లేని నూతన సమాజ నిర్మాణం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో.. సిద్దిపేట జిల్లా ఎమ్మార్పీఎస్ కో ఇన్చార్జి ముక్కపల్లి రాజు మాదిగ , దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జ్ మైస రాములు మాదిగ,మండల అధ్యక్షులు అయ్యగల్ల రవి మండల ప్రధాన కార్యదర్శి మల్లేశం నర్సింలు అధికార ప్రతినిధి తుడుం ప్రశాంత్ సలహాదారులు స్వామి కోశాధికారి కొనింటి రాజు అంబేద్కర్ సంఘం అధ్యక్షులు ఎల్లయ్య తుడుం ప్రకాష్ రాయపోల్ ఎమ్మార్పీఎస్ గ్రామ అధ్యక్షులు తిప్పారం శ్రీకాంత్ ఉపాధ్యక్షులు తుడుం వినోద్ ఉషి గారి మధుసూదన్ ప్రధాన కార్యదర్శి దయ్యాల నరేష్ కార్యదర్శి సహాయ కార్యదర్శి ఉషనగల లక్ష్మణ్ మాసంపల్లి కనకయ్య కోశాధికారి జోగు పరిసరం ఇంద్రకరణ్ సలహాదారులు మాసనపల్లి కుమార్ సభ్యులు తుడుం వాల్మీకి మాసనపల్లి యాదగిరి మల్లేశం భూమి జోసెఫ్ మాసంపల్లి రాజు బోడ ఎల్లం దయ్యాల స్వామి శ్రీకాంత్ శేఖర్ ప్రభాకర్ మల్లయ్య నవీన్ నరేష్ మదనపల్లి ప్రభాకర్ శివప్రసాద్ చరణ్ తేజ్ జాంబవంతుడు యాదగిరి నాగరాజు తదితరులు
పాల్గొన్నారు
