

జనం న్యూస్ జనవరి 24 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ:- చంద్రబాబు నాయుడు పబ్లిక్ సిటీ కోసమే దావోస్ వెళ్లారని, ఒట్టి చేతులతో తిరిగి వచ్చారని కోడుగుడ్డు మంత్రి కి రాష్ట్రంలో పెట్టుబడులు వరదలా వస్తున్న విషయాన్ని కళ్ళున్న మాజీ పరిశ్రమల మంత్రికి గుడివాడ అమర్నాథ్ కనపడలేదని తెలుగుదేశం పార్టీ అనకాపల్లి పార్లమెంట్ మీడియా కోఆర్డినేటర్ కొణతాల వెంకటరావు అమర్నాథ్ పై విరుచుకుపడ్డారు. జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ కోడి గుడ్డు మంత్రులతో కలిపి సుమారు 800 కోట్లు పబ్లిసిటీ కోసమే, సాక్షి పత్రిక, సాక్షి మీడియాకు, ఇతర పత్రికలకు ప్రతి బటన్ నొక్కుడుకు ప్రకటనలు ఇచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, వైసిపి పాలనలో జగన్ రెడ్డి కోడి గుడ్డు మంత్రి కలిసి 78 కోట్లు ఖర్చుపెట్టి దావోస్ వెళ్లి భారతదేశానికి చెందిన పారిశ్రామికవేత్తలు అంబానీ, ఆదానీని కలిసి వచ్చారే తప్ప ఒక పెట్టుబడిన ఆనాడు తీసుకురాలేదని, దావోస్ లో చలి ఎక్కువగా ఉంటాదని మైనస్ డిగ్రీలో ఉండడం వల్ల మొదట రెండు సంవత్సరాలు వరల్డ్ ఎకనామిక్ సమ్మిటికి వెళ్లలేదని, తరువాత విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు పేరుతో ప్రజాధనంతో 138 కోట్లు ఖర్చుపెట్టి 13 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని, 6 లక్షల ఉద్యోగాలు వస్తాయని ప్రజలకు అబద్ధాలు చెప్పారని, పారిశ్రామికవేత్తలు ఎవరూ రాలేదని, వారు నియమించుకున్న ఐప్యాక్ సభ్యులు సచివాలయ సిబ్బంది, వారికి సూట్లు ధరించి ముచ్చటగా మూడు రోజులు నోవోటల్ హోటల్లో రాజభోగాలు అనుభవించారు తప్ప ఒక్క పరిశ్రమ రాలేదని ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేని వారు కోడిగుడ్డు మంత్రి అమర్నాథ్ కు చంద్రబాబు లోకేష్ గురించి మాట్లాడే అర్హత లేదని వెంకటరావు మండిపడ్డారు. గతంలో దావోస్ వెళ్లి వచ్చిన తర్వాత ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానమివ్వలేదని, ఇప్పుడే కోడి గుడ్డు పెట్టిందని, ఇంకా ఈకలు రావాలని కోడి పెద్దదవ్వాలని ఆ విధంగా రాష్ట్రం పరువు తీసి, వ్యంగ్యంగా మాట్లాడి అహంకారం ప్రదర్శించిన విషయం మరిచిపోయినట్టు ఉందని, 2014 -19 మధ్యన తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చిన పరిశ్రమలు అన్ని అనంతపురంలో కియా మోటార్స్ మేమే తీసుకువచ్చామని, ఇప్పుడా ఆర్సిలర్ నిప్పన్ ఉక్కు ఫ్యాక్టరీ నక్కపల్లి మండలంలో రాజయ్యపేట దగ్గర మేమే తీసుకువచ్చామని, గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ హబ్, బల్క్ డ్రగ్ పార్కు జగన్ సారధ్యంలోనే మంజూరు అయ్యాయని చెప్పడం సిగ్గు ఎగ్గు లేకుండా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని వెంకటరావు ఎద్దేవా చేశారు. కడప ఉక్కు ఫ్యాక్టరీకి జగన్ రెడ్డి రెండు సార్లు శంకుస్థాపన చేసి తన పాలనలో ఒక్క అడుగు ముందుకు వేయలేదని జిందాల్ తో అగ్రిమెంట్ అయిందని 3 లక్షల కోట్లు పెట్టుబడి పెడతారని చెప్పారని చెప్పిన విషయం మరిచిపోయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం జిందాలను తరిమివేశారని చెప్పడం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించిన చందంగా ఉందని, అదే సచిన్ జిందాల్ చంద్రబాబు నాయుడు ను దావోస్ లో విజినరీ నాయకుడని ప్రపంచానికి దిక్సూచిని తన ప్రసంగంలో పారిశ్రామికవేత్తలు చేత చప్పట్లు కొట్టించాడని చెవులు ఉండి కళ్ళు ఉండి చూడలేరు వినలేరు, ఇటువంటి నీచులు మాటలు ప్రజలు గమనించి అనకాపల్లి నుండి తరిమివేసిన, వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పి 11 సీట్లు కు కూర్చోబెట్టిన ఇంకా వీరిలో పరివర్తన లేదని, అబద్ధపు ప్రచారాలతో బతకడానికి నిర్ణయించుకున్నారని, ఇటువంటి వారిని రాజకీయంగా భూస్థాపితం చేయవలసిన అవసరం ఉందని, ఇంకా ఆంధ్రప్రదేశ్ కు అభివృద్ధి లేకుండా చేయాలని, నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు లేకుండా పరిశ్రమలు రాకుండా తప్పుడు ప్రచారాలతో ఆంధ్రప్రదేశ్ పరువు మర్యాదలు తీస్తున్న ఇటువంటి వారికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలని ప్రజలకు వెంకటరావు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ భోగలింగేశ్వర దేవస్థానం చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ బిజెపి నాయకులు మారిశెట్టి భాస్కరరావు పాల్గొన్నారు.