

జనం న్యూస్ జూన్ 23 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి
హనుమకొండ జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కీం లో చదువుతున్న నిరుపేద ఎస్సీ ఎస్టీ విద్యార్థుల యొక్క మూడు సంవత్సరాల పెండింగ్ నిధులు విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరంఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు స్టాలిన్ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం నుండి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ లో చదువుతున్న విద్యార్థుల నిధులు విడుదల కాక స్కూల్ యజమాన్యాలు చేతులెత్తేయడంతో విద్యార్థులందరూ ఎక్కడ చదువుకోవాలో తెలియక సతమత మవుతు వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందుల కు గురవుతున్నారని అన్నారు.స్థానికత కలిగిన విద్యార్థులు కేవలం సీటు కోసం వలస వెళ్ళే పరిస్థితి వస్తుంది.కావున విద్యార్థుల స్థానికత ఆధారంగా ఉన్న స్థానిక ప్రైవేట్ విద్యా సంస్థలలో స్థానికంగా ఉన్న పిల్లలకు సీట్లు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలి.రాష్ట్ర ప్రభుత్వం గత పెండింగ్ నిధులతో పాటు ఈ సంవత్సరం కూడా బెస్ట్ అవైలబుల్ స్కీంని కొనసాగిస్తూ పేద ఎస్సీ ఎస్టీ విద్యార్థులను ఆదుకోవాలని
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 210 కోట్లు బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు అలాగే హనుమకొండ జిల్లాలో 4 కోట్లు విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు లేదంటే రాబోయే రోజుల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని తెలిపారు…..