

సాగర్ కమలా నెహ్రూ ఏరియాఆస్పత్రిలో సమ్మె నోటీసులు అందజేసిన సిఐటియు నాయకులు
జనం న్యూస్- జూన్ 23- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-
జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా 11 ట్రేడ్ యూనియన్లతో తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ లక్ష్మీనారాయణ జిల్లా నాయకులు ఎస్కే బషీర్ కోరారు. ఈ సందర్భంగా నందికొండ మున్సిపాలిటీ నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని కమల నెహ్రూ ఏరియా హాస్పిటల్ లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటారని ఆర్ ఎం ఓ డాక్టర్ చక్రవర్తి కి సమ్మె నోటీస్ సిఐటియు నాయకులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ గార్డ్ ఔట్సోర్సింగ్ సిబ్బందికి గత మూడు నెలలుగా వేతనాలు రావడం లేదని, అది కూడా కనీస వేతనం చట్టం అమలు చేయకుండా నామమాత్రపు వేతనాలు ఇస్తున్నారని సిబ్బందికి పూర్తిస్థాయిలో వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది దేవయ్య, జమీర్,లక్ష్మణ్, శ్యామ్,సత్తి,నాగమణి తదితరులు పాల్గొన్నారు.