

జనం న్యూస్,జూన్23,అచ్యుతాపురం:
అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామంలో ఫిషింగ్ హార్బర్ పనులు ప్రారంభించడం వల్ల స్థానిక మత్స్యకారులు పడవలను ఒడ్డుకు చేర్చకుండా హార్బర్లో నిలుపుకొనే వీలు కలుగుతుందని అలాంటి ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని,పూడిమడక గ్రామంలో సుమారు 20 వేలు పైగా జనాభా జీవిస్తున్నారని ఆరోగ్య పరమైన సమస్యలు వస్తే బయట హాస్పిటల్ కు వెళ్లి చూపించుకునే ఆర్ధిక స్తోమత లేదని ఏషియన్ పెయింట్స్ కంపెనీ వారి సహకారంతో నడుస్తున్న క్లినిక్ ను సుమారు నెలరోజుల క్రితం పూడిమడక గ్రామం నుండి తరలించడం జరిగిందని ఏషియన్ పెయింట్స్ క్లినిక్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మత్స్యకార నాయకులు వాసుపల్లి శ్రీనివాస్, చేపల శ్రీరాములు,ఏరిపల్లి భాను,బండియ్య తదితరులు ఈరోజు అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పిజిఆర్ఎస్ లో అధికారులకు వినతిపత్రాన్ని అందించారు.