Listen to this article

దళిత సంఘాల డిమాండ్

జనం న్యూస్ జూన్ 24 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో

వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలం పుట్టపహాడ్ గ్రామంలో అదే విధంగా ఖమ్మం జిల్లా వైరా మండలం సిరిపురం గ్రామంలో ఆదివారం రోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం హేయమైన చర్య అని భారతీయ బౌద్ధ మహాసభ,అంబేద్కర్ సంఘం,సిద్దార్థ యువజన సంఘాలు తీవ్రంగా ఖండించారు.మంగళవారం మండల కేంద్రం లోని జేత్వాన్ బుద్ద విహార్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.దుండగులను పట్టుకొని వెంటనే కఠినంగా శిక్షించాలని ,ఇలాంటి చర్యలు పునరావృత్తం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షులు అశోక్ మహుల్కర్ డిమాండ్ చేశారు.భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేయడం వల్ల దళితుల మనోభావాలను దెబ్బ తీయడానికి అగ్రవర్ణాల వాళ్ళు ప్రయత్నిస్తున్నారని,వారి ఆగడాలను సాగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వారి డిమాండ్ చేశారు. ప్రజలు ఆదర్శంగా తీసుకోవాల్సిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పై కొంతమంది అజ్ఞానులు తెలియక దాడులకు పాల్పడుతున్నారని అలాంటి వారిని ముందే గుర్తించి పోలీస్ శాఖ వారు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ బౌద్ధ మహ సభ జిల్లా అధ్యక్షులు అశోక్ మాహుల్కర్, సమతా సైనిక దళ్ జిల్లా బాధ్యులు దుర్గం సందీప్, మండల భారతీయ బౌద్ధ మహా సభ అధ్యక్షులు దుర్గం దుర్గాజి, ప్రధాన కార్యదర్శి విజయ్ ఉప్రే, మాజీ మార్కెట్ కమటి డైరెక్టర్ రోషన్ ఉప్రే,సిద్దార్థ యువజన సంఘం నాయకులు దుర్గం మనోజ్,రాకేష్ ,జాడే మారుతి, శివాజీ, దుర్గం మోను,నూతన్ ప్రసాద్,దుర్గం స్వాగత్ ,తదితరులు పాల్గొన్నారు.