Listen to this article

జనం న్యూస్ జూన్ 24 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ


, కాట్రేనికొన మండలంలో మట్ట శివకుమార్ ఆధ్వర్యంలో, ఘన నివాళి సభ నిర్వహించబడింది.
ముఖ్యఅతిథిగా బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీభారత దేశ ఐక్యత, సమగ్రత, రాజ్యాంగ పరిరక్షణ కోసం తన ప్రాణాలనే అర్పించిన డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి బలిదానాన్ని స్మరించుకుంటూ, ఈరోజు 23 జూన్ 2025న బలిదాన్ దివస్ గా మనం ఘనంగా నివాళులర్పించారు.మండలంలో పలుచోట్ల కాట్రేనికోన, చేయరు, నడవపల్లి, చెయ్యరు అగ్రహారం, సభలో మండల అధ్యక్షులు శివ కుమార్ సెక్రటరీ కొత్తలంక సురేష్, ప్రసాద్, సీనియర్ నాయకులు మట్ట సూరిబాబు, నంద్యాల వెంకన్న బాబు, నంద్యాల చంటి, వెంకటేశ్వరావు ,శ్రీను ,రాంబాబు, తదితరులు పాల్గొన్నారు ఆయన ఆశయాలను స్మరించారు. గ్రంధి నానాజీ మాట్లాడుతూ
డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గ భారతీయ జనసంఘ స్థాపకులు,దేశ ఐక్యత కోసం ” ఒకే రాజ్యం, ఒకే చట్టం” అనే నినాదంతో ముందుకు సాగారు,1953లో కాశ్మీర్ ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమంలో అరెస్ట్ అయిన తర్వాత అనుమానాస్పద పరిస్థితుల్లో ఆయన మరణించారు. ఈ రోజు ఆయన త్యాగానికి గుర్తుగా దేశం ఆయన బలిదానాన్ని స్మరిస్తోంది.”డాక్టర్ ముఖర్జీ చూపించిన దిశలో నడుచుకుంటూ దేశ భవిష్యత్తును నిర్మించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. దేశ ఐక్యత, చట్టాల సమానత్వం, రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండాలి,” అని తెలిపారు.