

.జనం న్యూస్ జూన్ 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం ఎడ్లను దొంగిలించిన వ్యక్తి ని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించినట్లు సీఐ పి రంజిత్ రావు తెలిపారు ఈ సందర్భంగా సీఐ పి రంజిత్ రావు మాట్లాడుతూ మండలం లోని గోవిందా పురం గ్రామానికి చెందిన మాందాటి కుమారస్వామి గల ఎద్దులు గురువారం రోజు తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు రెండు ఎడ్లను దొంగిలించారని శాయంపేట పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా గత శనివారం రోజున కేసు నమోదు చేయగా కేసు దర్యాప్తు లో భాగంగా ఎడ్లను దొంగిలించిన వ్యక్తి మండలంలోని పెద్ద కోడాపాక గ్రామానికి చెందిన కోగీల రాజు గుర్తించి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు ఎడ్లను దొంగిలించిన వ్యక్తి ని త్వరితగతిన పెట్టుకున్న కానిస్టేబుల్ సతీష్ ఖలీద్ లకు సీఐ రివార్డ్ ప్రకటించి వారిని అభినందించారు ఎడ్లను యజమానికి అప్పగించారు గోవిందా పురం గ్రామ రైతులు పోలీస్ లను అభినందనలు తెలియజేశారు……