

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు మండలం డాక్టర్ పి.వి నరసింహారావు హాస్పిటల్ నందు, శ్రీనివాస హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన, ఉచిత మెగా వైద్య శిబిరంకి విశేష స్పందన లభించింది.ఈ శిబిరంలో సాధారణ రోగులతో పాటుగా కార్డి యాలజీ, వైటల్ చెక్,జనరల్ బీ.పీ. ఈసీజీ ,2డి,ఎకో,ఆర్థో చెకప్,తదితర సమస్యలపై పరీక్షలను నిర్వహించారు.ఉదయం 9.30 నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ వైద్య శిబిరంలో దాదాపు 250 మందికి పైగా వైద్య శిబిరంలో పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు.ఈ కార్యక్రమంలోశ్రీనివాస హాస్పిటల్ కడప సిబ్బంది ,డాక్టర్ పృథ్వి, హెచ్ఆర్ సుధాకర్, తదితరులు పాల్గొన్నారు. .