

జనంన్యూస్. 24నిజామాబాదు.
బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మాదాసు స్వామి యాదవ్.
దేశంలోని అన్ని రంగాలు మరియు అన్ని ప్రాంతాల ప్రజల యొక్క సర్వతో ముఖాభివృద్ధి కోసమే నరేంద్ర మోడీ ప్రభుత్వం చిత్తశుద్ధితో గత 11 సంవత్సరాలుగా పనిచేస్తున్నదని రానున్న రోజులలో భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా మలిచేందుకు నిరంతర కృషిని కొనసాగిస్తామని అందుకోసం దేశ ప్రజలందరి యొక్క మద్దతు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మాదాసు సామి యాదవ్ వ్యాఖ్యానించారు.బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర శాఖ పిలుపుమేరకు *నిజామాబాద్ రూరల్ మండల్ మల్లారం గ్రామం ప్రజలతో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ సేవ ,సుపరిపాలన, పేదల సంక్షేమనికి 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వము ప్రజలకు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల ద్వారా 81 కోట్లకు పైగా లబ్ధిదారులకు ప్రధానమంత్రి గారి కళ్యాణ్ యువజన ద్వారా ఉచిత రేషన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా 4కోట్లకు పైగా ఇల్లు నిర్మాణం,15 కోట్లకు పైగా గ్రామీణ కుటుంబాలకు ఘర్ ఘర్ జల్ యోజన ద్వారా నల్ల కనెక్షన్లు, రానున్న రోజుల్లో మరిన్ని అద్భుతమైన పథకాల ద్వారా ప్రజలకి అభివృద్ధి ఫలాలను అందించడం కోసం కృషి చేస్తున్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి భారత ప్రజలందరూ తమ యొక్క మద్దతును తెలుపుతున్నట్టు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఎంతో మంది ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరుతున్నదని ప్రజలు మరింత అవగాహన పెంచుకొని అర్హత కలిగిన అన్ని పథకాలకు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ గ్రామం నాయకులు మాజీ ఉపసర్పంచ్ చికోటి రవి, సొసైటీ డైరెక్టర్ గోపి, బొల్లం గంగాధర్,దశరథ, మోహన్, గంగాధర్, రాజకుమార్ ఓబీసీ ఐటీ సెల్,
మరియు ఓబీసీ మోర్చా నాయకులు పాల్గొన్నారు.